Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'గీత గోవిందం' నాయికకు బాలీవుడ్ ఆఫర్లు
  • మహేశ్ ఔదార్యం.. పాతిక లక్షల విరాళం 
  • బన్నీ తమిళ సినిమా మరింత ఆలస్యం!

*  తనకు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని చెబుతోంది రష్మిక మందన. తాజాగా విడుదలైన 'గీత గోవిందం' చిత్రంతో కథానాయికగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ, 'హిందీ సినిమాలు చేయాలని ఉంది. ఆఫర్లు వస్తున్నాయి. నాకు నచ్చడం లేదు. మంచివి వస్తే కనుక చేస్తా' అని చెప్పింది.
*  వర్షాలు, వరదలతో అతలాకుతలమై నిరాశ్రయులైన లక్షలాది మంది కేరళీయులకు పలువురు ఆపన్న హస్తాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు కూడా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజగా తన వంతుగా 25 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించాడు.
*  లింగుసామి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తమిళంలో ఓ స్ట్రెయిట్ సినిమా రానున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ చిత్రం మరికొంత కాలం ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ఈ విషయంపై అల్లు అర్జున్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు తాజాగా స్పందిస్తూ 'ఇద్దరూ ఎవరికి వారు బిజీగా వుండడంతో ఆ ప్రాజక్టు సెట్ అవడానికి ఆలస్యం జరుగుతోంది. ఇద్దరికీ ఫ్రీ అయినప్పుడు తప్పకుండా ఆ తమిళ చిత్రం వుంటుంది' అని చెప్పాడు.  

  • Loading...

More Telugu News