Chandrababu: పినరయి విజయన్ కు ఫోన్ చేసిన చంద్రబాబు

  • ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధమని చెప్పిన చంద్రబాబు
  • ఇప్పటికే రూ. 10 కోట్ల సాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • మంగళగిరి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తరలింపు

భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలమైంది. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలు కేరళకు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రూ. 10 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేశారు. ఎలాంటి సాయం చేసేందుకైనా తాము సిద్ధమని ఈ సందర్భంగా చెప్పారు. మంగళగిరిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇప్పటికే కేరళకు ఏపీ ప్రభుత్వం పంపింది. దీంతో పాటు ఆహార పదార్థాలు, పాలు, పండ్లు, బిస్కెట్లను పంపనుంది. విపత్తు నుంచి కేరళ త్వరగా బయటపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కేరళను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Chandrababu
pinarayi vijayan
phone call
  • Loading...

More Telugu News