Rahul Gandhi: కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: ప్రధాని మోదీకి రాహుల్ విజ్ఞప్తి
- ట్విట్టర్ లో కోరిన కాంగ్రెస్ అధినేత
- కేరళ వాసులు ప్రమాదంలో ఉన్నారని వ్యాఖ్య
- రూ.500 కోట్ల తక్షణ సాయం ప్రకటించిన మోదీ
భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళలో ప్రధాని మోదీ ఈ రోజు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్వే అనంతరం మోదీ కేరళకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీని కోరారు. వెంటనే ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ట్విట్టర్ లో విజ్ఞప్తి చేశారు.
‘ప్రియమైన ప్రధాని మోదీ గారూ.. దయచేసి ఎలాంటి ఆలస్యం చేయకుండా కేరళ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి. లక్షలాది మంది ప్రజల జీవితాలు, ప్రాణాలు, భవిష్యత్ ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నాయి’ అని రాహుల్ ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు.