modi: మోదీకి అనుకూలించని వాతావరణం.. ఏరియల్ సర్వే రద్దు!

  • కేరళలో ఏరియల్ సర్వే నిర్వహించాలనుకున్న మోదీ
  • అనుకూలించని వాతావరణం
  • గవర్నర్, సీఎంలతో రివ్యూ మీటింగ్

భారీ వర్షాలు, వరదలతో కేరళ అతలాకుతలం అయింది. వరద బీభత్సానికి నిన్న సాయంత్రం వరకు 173 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 106గురు ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో, కేరళ వరద పరిస్థితిని పరిశీలించేందుకు ప్రధాని మోదీ ఈ ఉదయం కొచ్చికి చేరుకున్నారు.

ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించాలనుకున్నారు. అలప్పుజా, పాతనమ్ తిట్ట, ఎర్నాకులం ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు సర్వం సిద్ధమయింది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని ఏరియల్ సర్వేను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో కలసి ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి గవర్నర్ సదాశివంతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

modi
Kerala
floods
areal survey
  • Loading...

More Telugu News