Vajpayee: వాజ్‌పేయికి ఆ నటి అంటే ఎంతిష్టమో.. ఆమె సినిమాను 25 సార్లు చూశారు!

  • హేమమాలిని అంటే వల్లమాలిన అభిమానం
  • సీత ఔర్ గీత సినిమాను పదేపదే చూసేవారు
  • ఎదురుపడినప్పుడు మాత్రం మాట్లాడలేకపోయారు

వాజ్‌పేయి.. ఈ పేరు చెప్పగానే గొప్ప రాజనీతిజ్ఞుడు, రాజకీయ దురంధరుడు గుర్తుకొస్తాడు. రాజకీయాల్లో విలువలకు నిలువెత్తు రూపం ఆయన. చాలా మందికి ఆయన అలాగే తెలుసు.  కానీ బాలీవుడ్ ‘డ్రీమ్ గాళ్’ హేమమాలిని అంటే వల్లమాలిన అభిమానం ఆయనకు. ఆమె నటించిన ‘సీత ఔర్ గీత’ సినిమాను ఏకంగా 25 సార్లు చూశారట. గతేడాది హేమమాలిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వాజ్‌పేయితో తన తొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు.

‘‘ఆఫీసు బేరర్లతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ వాజ్‌పేయి ప్రసంగాల గురించి ప్రస్తావించా. అయితే, నేనెప్పుడూ ఆయనను కలవలేదు. దీంతో వారు నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన నాతో మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం నాకు అర్థమైంది. ఆ తర్వాత నాకు తెలిసింది.. వాజ్‌పేయి నా అభిమాని అని’’ అంటూ హేమమాలిని గుర్తు చేసుకున్నారు.

వాజ్‌పేయి గురించి ఓ మహిళ తనతో చెప్పిన విషయాన్ని కూడా హేమమాలిని పంచుకున్నారు. ‘‘నిజానికి అటల్ బిహారీ వాజ్‌పేయి మీకు పెద్ద అభిమాని. 1972లో ఆయన మీ సినిమా ‘సీత ఔర్ గీత’ను 25సార్లు చూశారు. మీరంటే అభిమానిస్తారు కాబట్టే మీరు ఎదురుపడినప్పుడు మాట్లాడలేకపోయారు’’ అని ఆమె తనతో చెప్పడంతో ఆశ్చర్యపోయినట్టు హేమ మాలిని తెలిపారు. 

Vajpayee
Bharat Ratna
Hema Malini
Sita aur Gita
Movie
Bollywood
  • Loading...

More Telugu News