AB vajpayee: వాజ్‌పేయి మరణిస్తే.. జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను పోస్ట్ చేసిన చైనా మీడియా
- జిన్హువా న్యూస్ ఏజెన్సీ తప్పిదం
- విరుచుకుపడిన నెటిజన్లు
- ట్వీట్‌ను డిలీట్ చేసి ఫొటోను సరిదిద్దిన సంస్థ
చైనా న్యూస్ ఏజెన్సీ జిన్హువా ఘోర తప్పిదం చేసింది. భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయిని గుర్తించడంలో విఫలమైంది. భారతరత్న వాజ్‌పేయి మృతి విషయాన్ని ట్వీట్ చేస్తూ ఆయన ఫొటోకు బదులుగా జార్జ్ ఫెర్నాండెజ్ ఫొటోను పోస్ట్ చేసింది. వాజ్‌పేయి కేబినెట్‌లో ఫెర్నాండెజ్ రక్షణ మంత్రిగా పనిచేశారు.
వాజ్‌పేయి ఫొటో బదులు ఫెర్నాండెజ్ ఫొటో కనిపించడంతో నెటిజన్లు ఫైరయ్యారు. చీప్ జర్నలిజానికి ఇది నిదర్శనమని దుమ్మెత్తిపోశారు. కనీసం ఫొటో అయినా మార్చాలని కోరారు. భారత్ అంటే చైనీయులకు ఎందుకంత అలుసని మరికొందరు కామెంట్ చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న జిన్హువా వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి తప్పును సరిదిద్దుకుంది. ఫొటోను సరిదిద్దిన తర్వాత కూడా కామెంట్ల వర్షం కురిసింది. మొత్తానికి తప్పును తెలుసుకుందని ట్వీట్ చేశారు.