Geeta Govindam: నా పెళ్లి ఆగిందట... ఎంత కామెడీయో!: హీరోయిన్ రష్మిక

  • సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'గీత గోవిందం'
  • సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మికా మందన 
  • బిజీగా ఉండటంతో పెళ్లి తేదీలు అనుకోలేదని వెల్లడి

కన్నడ హీరో రక్షిత్ తో తన వివాహం ఆగిపోయిందని వస్తున్న వార్తలపై 'గీత గోవిందం' హీరోయిన రష్మికా మందన స్పందించింది. ఈ తరహా వార్తలను వింటే తనకు నవ్వు వస్తుందని చెప్పింది. తన కొత్త చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా, ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. తను, రక్షిత్, నిశ్చితార్థం నాడే, రెండున్నరేళ్ల తరువాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇప్పుడు నటనలో బిజీగా ఉండటంతో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలన్న తేదీలను నిర్ణయించుకోలేదని చెప్పింది.

'గీత గోవిందం' సినిమా కోసం దాదాపు ఏడున్నర నెలలు పని చేశానని, ఏడు నెలల పాటు కోపంతో నటించిన తాను, చివరి 15 రోజులు మాత్రం సరదాగా గడిపానని చెప్పింది. ఈ సినిమాను చాలా మంది హీరోయిన్లు వదిలేసుకున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, వాళ్లు ఎందుకు కాదన్నారో తనకు తెలియదని చెప్పింది. కాగా, ప్రస్తుతం రష్మిక  తెలుగులో ‘డియర్‌ కామ్రేడ్, ‘దేవదాస్‌’ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Geeta Govindam
Rashmika Mandanna
Rakshit
Marriage
Engagement
  • Loading...

More Telugu News