Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సూపర్ స్టార్ కి జోడీగా త్రిష!
  • జయలలిత పాత్రలో విద్యాబాలన్
  • స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న దర్శకుడు

*  చెన్నయ్ బ్యూటీ త్రిష సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జతకట్టే ఛాన్స్ ను పొందుతోంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ తన 162వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా త్రిషను ఎంపిక చేసుకుని ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం విదితమే. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి నిర్మించే ఈ చిత్రంలో జయలలితగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించనున్నట్టు సమాచారం.
*  ఇటీవల వచ్చిన 'మహానటి' సినిమాలో దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రను నేటి దర్శకుడు క్రిష్ పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పాత్రను ఆయన పోషించనున్నాడు. అయితే, ఈసారి తన దర్శకత్వంలోనే నటించనుండడం విశేషం. 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఈ ముచ్చట చోటుచేసుకుంటోంది.

Trisha
Vidyabalan
Krish
  • Loading...

More Telugu News