Andhra Pradesh: ద్వారకా తిరుమలలో డ్రెస్ కోడ్.. నవంబరు నుంచి అమలు
- నవంబరు నుంచి అమలు
- పురుషులు పంచె కండువా
- మహిళలు చీర, చుడీదార్ మాత్రమే ధరించాలి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమలలో భక్తులకు డ్రెస్ కోడ్ అమలు చేయనున్నట్టు ఆలయ నిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ద్వారకా తిరుమలను భక్తులు రెండో తిరుపతిగా భావిస్తారు. ఆలయంలో నిత్యార్జిత కల్యాణం జరిపించుకునే భక్తులు డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాల్సిందేనని పెద్దిరాజు పేర్కొన్నారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, చుడీదార్ మాత్రమే ధరించాలని స్పష్టం చేశారు. నవంబరు ఒకటో తేదీ నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి వస్తుందని, భక్తులు గ్రహించాలని కోరారు.