Rahul Gandhi: భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయింది: రాహుల్ గాంధీ
- విచారం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
- ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప రాజకీయవేత్త
- వాజ్ పేయి ఆత్మకు శాంతి కలగాలి
మాజీ ప్రధాని వాజ్ పేయి మృతి పట్ల పలువురు ప్రముఖులు స్పందించారు. ఆ వివరాలు..
వాజ్ పేయి మరణంతో ఓ శకం ముగిసింది. గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయాం. వాజ్ పేయి ఓ సునిశిత విమర్శకుడు. ప్రధానిగా నిరంతరం ఏకాభిప్రాయ సాధన కోసం శ్రమించారు - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
వాజ్ పేయి గొప్ప ప్రధాని మాత్రమే కాదు, మంచి వక్త కూడా. విశిష్ట ప్రజానాయకుడు, ప్రభావితం చేయగలిగే కవి వాజ్ పేయి - మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్ పేయి మృతితో భరతమాత తన ముద్దుబిడ్డను కోల్పోయింది. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప రాజకీయవేత్త వాజ్ పేయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
నిబద్ధత కలిగిన రాజకీయవేత్త వాజ్ పేయి. వర్తమాన రాజకీయ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్
ఓ మహావ్యక్తి అంతర్థానమయ్యారు. వాజ్ పేయి ఇచ్చిన స్ఫూర్తి, ప్రేరణలు జీవితాంతం నిలిచే ఉంటాయి - యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్