vajpayee: వాజ్ పేయిని గట్టిగా హత్తుకున్న మోదీ.. వైరల్ అవుతున్న పాత వీడియో!

  • వాజ్ పేయిని తన స్ఫూర్తిదాతగా తరచూ చెప్పుకునే మోదీ
  • ఇద్దరి మధ్య మంచి అనుబంధం
  • గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీకి క్లాస్ పీకిన వాజ్ పేయి

మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అయిన వాజ్ పేయిని తన స్ఫూర్తిదాతగా ప్రధాని మోదీ తరచుగా చెప్పుకుంటుంటారు. వాజ్ పేయితో మోదీకి ముందు నుంచే మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో వాజ్ పేయిని మోదీ గట్టిగా హత్తుకున్న ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో తనను హత్తుకున్న మోదీ వీపును వాజ్ పేయి ఆప్యాయంగా తడుతున్న దృశ్యం ఉంది. వీరిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో మోదీకి 'రాజధర్మం' అంటే ఏంటో వాజ్ పేయి క్లాస్ పీకారని చెప్పుకుంటుంటారు.

  • Loading...

More Telugu News