srinagar: శ్రీనగర్ లో దారుణం.. జాతీయజెండా ఎగురవేసేందుకు యత్నించిన వ్యక్తిపై దాడి

  • శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద ఘటన
  • దాడికి యత్నించిన స్థానికులు
  • వెంటనే అక్కడకు చేరుకుని వ్యక్తిని రక్షించిన సీఆర్పీఎఫ్

జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్ లో కలకలం రేగింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయపతాకాన్ని ఎగురవేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై స్థానికులు దాడి చేశారు. లాల్ చౌక్ సమీపంలోని క్లాక్ టవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టామని చెప్పారు. సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకోవడంతో... ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మరోవైపు... 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాల్ చౌక్ వద్ద కొందరు జాతీయ జెండాను ఎగురవేశారని... దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానికులు నిరసనకు దిగారని... దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని స్థానిక మీడియా తెలిపింది. 

srinagar
inependence day
flag hoisting
attack
  • Loading...

More Telugu News