kvp ramchandra rao: ‘పోలవరం’పై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: కేవీపీకి కోడెల హితవు

  • కేవీపీ ఇటీవల రాసిన లేఖపై కోడెల ఘాటు స్పందన
  • ‘పోలవరం’ పూర్తవ్వాలంటే కావాల్సింది చిత్తశుద్ధి 
  • ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతిగా గౌరవనీయమైన స్థానంలో ఉన్న కోడెల శివప్రసాద్, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఉద్దేశపూర్వకంగా జాతిని తప్పుదోవ పట్టిస్తారని కనీసం కలలో కూడా ఎవరూ అనుకోరంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ మేరకు కోడెలకు ఓ లేఖ రాయడం తెలిసిందే.

ఈ లేఖపై స్పీకర్ కోడెల ఘాటుగా స్పందించారు. కేవీపీ కంటే తనకు రాజకీయ అనుభవం ఎక్కువని, గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం తనకు ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలంటే కావాల్సింది రాజకీయాలు కాదు, చిత్తశుద్ధి అని కేవీపీకి హితవు పలికారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే 57 శాతం పూర్తయిందని, వాస్తవాలు తెలుసుకుని కేవీపీ మాట్లాడాలని సూచించిన కోడెల, పోలవరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని చెప్పారు.

kvp ramchandra rao
kodela
  • Loading...

More Telugu News