venkatesh: 32 ఏళ్లుగా మీ ప్రేమ పొందుతున్న అదృష్టవంతుడిని.. విక్టరీ వెంకటేశ్ వైరల్ పోస్ట్ !

  • అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన వెంకీ
  • త్వరలో సర్ ప్రైజ్ ఇస్తానని వెల్లడి
  • తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ విడుదలై నేటికి 32 ఏళ్లు

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ గా మారిన విక్టరీ వెంకటేశ్ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి నేటికి 32 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఓ భావోద్వేగ పోస్ట్ ను వెంకటేశ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ రోజు తాను నటుడిగా జన్మించానని చెప్పారు.

‘‘నేను తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. 1986, ఆగస్టు 14న నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ విడుదలైంది. ఈ రోజే నేను నటుడిగా జన్మించాను. గత 32 సంవత్సరాలుగా మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతూనే ఉన్నా. అందుకు నేనెంతో అదృష్టవంతుడిని. నేను నా సినీ ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేయబోతున్నాను. దీని ద్వారా మీ అందరికీ మరింత దగ్గరవుతాను. త్వరలోనే మీకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నా’’ అని వెంకటేశ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం వెంకటేశ్ వరుణ్ తేజ్ తో కలసి ‘ఎఫ్2’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. మరోపక్క, కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి వెంకీ మరో సినిమా కూడా చేయనున్నారు.

venkatesh
32 years
kaliyuga paandavulu
1986 august 14
surprise
Tollywood
  • Loading...

More Telugu News