Rahul Gandhi: టీకాంగ్రెస్ నేతలకు క్లాస్ పీకిన రాహుల్ గాంధీ!

  • రాహుల్ తో భేటీ అయిన కాంగ్రెస్ సీనియర్లు
  • నేతలతో విడివిడిగా మాట్లాడిన రాహుల్
  • పార్టీ విజయం కోసం ఐక్యతగా పని చేయాలంటూ సూచన

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు క్లాస్ పీకారు. ఈ ఉదయం ఆయనతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, జైపాల్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేణుకా చౌదరి, రేవంత్ రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఒక్కో నేతతో ఆయన విడివిడిగా మాట్లాడి, పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు.

అనంతరం రాహుల్ వారితో మాట్లాడుతూ, నేతలంతా విభేదాలను పక్కనపెట్టి, ఐక్యంగా పని చేయాలని సూచించారు. ఈ భేటీ సందర్భంగా నేతల మధ్య సఖ్యత లేదనే విషయంపైనే రాహుల్ దృష్టి సారించినట్టు సమాచారం. ప్రతి నేతతో మాట్లాడుతూ, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ విజయం కోసం అందరూ ఐకమత్యంగా కలసి పని చేయాలని సూచించారు.

Rahul Gandhi
tcongress
meeting
  • Loading...

More Telugu News