Hyderabad: పరిపూర్ణానందకు ఊరట... హైదరాబాద్ రావచ్చన్న హైకోర్టు!
- పరిపూర్ణానందపై హైదరాబాద్ పోలీసుల నగర బహిష్కరణ
- సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన స్వామి
- పోలీసుల ఆదేశాలపై స్టే విధించిన హైకోర్టు
యువతలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారన్న ఆరోపణలపై నగర బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదోపవాదాలు విన్న తరువాత, ఆయన ఎక్కడైనా తిరగవచ్చని చెబుతూ, తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ బహిష్కరణ ఉత్తర్వులను నిలుపుదల చేస్తున్నట్టు పేర్కొంది.