Allu Aravind: ఆ భారీ చిత్రం భవిష్యత్తు గురించి తలచుకుంటే బాధేస్తోంది: అల్లు అరవింద్ షాకింగ్ వ్యాఖ్యలు

  • విడుదలకు ముందే ఓ భారీ చిత్రం లీక్
  • మరో రెండు సినిమాలు కూడా
  • టాలీవుడ్ లో కొత్త చర్చకు తెరలేపిన అల్లు అరవింద్

తెలుగు చిత్రాల్లోని సీన్స్ సోషల్ మీడియాలో కనిపిస్తుండటంపైన, పైరసీపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'గీత గోవిందం' పైరసీ అయిన విషయాన్ని, దాదాపు సగం సినిమా విడుదలకు ముందే బయటకు రావడాన్ని ప్రస్తావించిన ఆయన, మరో మూడు సినిమాలు కూడా ముందే లీక్ అయ్యాయని అన్నారు. వీటిల్లో ఓ టాప్ హీరో నటించిన భారీ చిత్రం కూడా ఉందని, వీటి గురించి ఆలోచిస్తుంటే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు.  

అల్లు అరవింద్ నోటి నుంచి వచ్చిన మాటలతో, ముందే లీక్ అయిన సదరు భారీ చిత్రం ఏంటన్న చర్చ జరుగుతోంది. త్వరలో విడుదలకు సిద్ధమైన పెద్ద చిత్రాల్లో నాగార్జున, నాని నటించిన 'దేవదాసు'తో పాటు 'శైలజారెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' తదితర చిత్రాలుండగా, ఎన్డీఆర్ 'అరవింద సమేత' సినిమా ఫొటోలు లీక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అయితే, అరవింద్ చెప్పిన ఆ మూడు సినిమాలు ఏవన్న వివరాలు తెలియరాలేదు.

Allu Aravind
Leak
Social Media
Geeta Govindam
  • Loading...

More Telugu News