Cooking Gas: వంట గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది!

  • రూ. 36 పెరిగిన సిలిండర్ ధర
  • రూ. 811 నుంచి రూ. 847కు చేరిక
  • మధ్యతరగతి ప్రజల ఆగ్రహం

వంట గ్యాస్‌ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలకు అనుగుణంగా 'పెట్రో', సహజవాయు ఉత్పత్తుల ధరలను సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు, ఈ దఫా ఏకంగా రూ. 36 వడ్డించేశాయి. దీంతో సిలిండర్ ధర రూ. 847కు చేరింది. హైదరాబాద్ పరిధిలో జూన్ నెలలో రూ. 753గా ఉన్న సిలిండర్ ధర, జూలైలో రూ. 811కు చేరిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే పేదలకు అందే సబ్సిడీని కూడా పెంచినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలపై మధ్య తరగతి ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Cooking Gas
Price Hike
OMCs
  • Loading...

More Telugu News