Jagan: 39 రోజులు 'తూర్పు'లోనే సాగిన యాత్ర... నేడు విశాఖ జిల్లాలో కాలు పెట్టనున్న వైసీపీ అధినేత జగన్!

  • పాదయాత్ర 187వ రోజున తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించిన జగన్
  • అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ యాత్ర
  • నేడు నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశం

దాదాపు 39 రోజుల పాటు తూర్పు గోదావరి జిల్లాలో సాగిన వైకాపా అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర నేడు విశాఖలో జిల్లాలోకి అడుగుపెట్టనుంది. పాదయాత్ర 237వ రోజున ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. జూన్ 12వ తేదీన పాదయాత్ర187వ రోజున తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ ప్రవేశించిన సంగతి తెలిసిందే.

ఉభయ గోదావరి జిల్లాల మధ్య ఉన్న రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ మీదుగా జగన్ రాజమహేంద్రవరంలో ప్రవేశించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనూ జగన్ చుట్టివచ్చారు. ఇప్పటివరకూ జగన్ 2,719.6 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోగా, ఈ ఉదయం కాకరాపల్లి నుంచి ఒక కిలోమీటరు నడిచిన తరువాత ఆయన విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించనుండగా, ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Jagan
Padayatra
Narsipatnam
East Godavari District
West Godavari District
Vizag
  • Loading...

More Telugu News