Sridevi: అతిలోక సుందరి బర్త్ డే స్పెషల్... ఎంతో మందికి తెలియని ఆసక్తికర అంశాలివి!
- నేడు శ్రీదేవి 55వ పుట్టిన రోజు
- జయంతిని జరుపుతున్న అభిమానులు
- 'జురాసిక్ పార్క్'లో అవకాశాన్ని వద్దనుకున్న శ్రీదేవి
- 1985 నుంచి 92 వరకూ అత్యధిక రెమ్యునరేషన్
కొన్ని దశాబ్దాల పాటు సినీ వినీలాకాశాన్ని ఏలి, అర్థాంతరంగా తనువు చాలించి, కోట్లాదిమంది అభిమానులను వదలి వెళ్లిపోయిన శ్రీదేవి... నేడు బతికుంటే, 55వ పుట్టిన రోజును జరుపుకుంటూ ఉండేది. ఇప్పుడు మన మధ్య లేని శ్రీదేవి జయంతిని ఆమె అభిమానులు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవి గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర అంశాలివి...
* 'జురాసిక్ పార్క్'లో నటించాలని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టివెన్ స్పీల్ బర్గ్ అవకాశం ఇవ్వగా, బాలీవుడ్ కు దూరం కావడం ఇష్టం లేక, ఆమె ఈ అవకాశాన్ని వద్దనుకుంది.
* హై ఫీవర్ తో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా కూడా 'చాల్ బాజ్' చిత్రంలో ఆమె 'నా జానే కహా సే ఆయే హై' పాటలో నటించింది.
* ఆమె నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వేళ, ఎంతో మంది భారత సంతతి కోటీశ్వరులు, అమెరికన్ల నుంచి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయి.
* ఆంగ్లం రాని సగటు ఇండియన్ గృహిణిగా 'ఇంగ్లీష్ - వింగ్లీష్' చిత్రంలో నటించిన శ్రీదేవి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం భాషలను మాట్లాడగలదు.
* తన తల్లి, సవతి తండ్రి, చెల్లెలు, సవతి సోదరులకు చిన్నతనంలోనే ఆర్థిక ఆసరాగా నిలిచింది.
* 1997లో వచ్చిన 'జుడాయి', 2000లో వచ్చిన 'హమారా దిల్ ఆప్ కే పాస్ హై' సినిమాల్లోని హీరోయిన్ పేర్లు జాన్వీ, ఖుషీ కాగా, ఆ పేర్లనే తన బిడ్డలకు శ్రీదేవి పెట్టుకుంది. ఈ రెండు చిత్రాలనూ బోనీ కపూర్ నిర్మించాడు.
* 1985 నుంచి 1992 వరకూ బాలీవుడ్ లో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నది శ్రీదేవే. ఆపై ఆమె స్థానాన్ని మాధురీ దీక్షిత్ ఆక్రమించింది.
* శ్రీదేవి హిందీలో డబ్బింగ్ చెప్పుకున్న తొలి చిత్రం 'చాందినీ'
* షారూఖ్ తొలి బాలీవుడ్ సూపర్ హిట్ 'బాజీగర్'లో శ్రీదేవితో ద్విపాత్రాభినయం చేయించాలని తొలుత భావించినా, ఓ పాత్రను షారూఖ్ హత్య చేయాల్సి వుండటంతో వద్దనుకున్నారట. ఆ సినిమాలో చాన్స్ తోనే కాజోల్, శిల్పా శెట్టిలు బాలీవుడ్ లో దూసుకెళ్లారు.