Narendra Modi: జన్‌ధన్ ఖాతాదారులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన మోదీ.. ఆగస్టు 15న తాయిలాల ప్రకటన!

  • 32  కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులకు తాయిలాలు
  • ఓవర్ డ్రాఫ్ట్‌ను రెట్టింపు చేసే అవకాశం
  • అసంఘటిత రంగానికీ వరాలు

సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న మోదీ ప్రజలను ఆకట్టుకునేందుకు తాయిలాల ప్రకటనకు సిద్ధమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న 32 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులకు ప్రత్యేక పథకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. జన్‌ధన్ ఖాతాదారులు రూ.10 వేల వరకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇది రూ. 5 వేలకే పరిమితం కాగా, ఇప్పుడు దీనిని రూ.10 వేలకు పెంచబోతున్నారని సమాచారం. అలాగే, అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించే ‘అటల్ ఫించన్ యోజన’ పథకం కింద పింఛను పరిమితిని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచనున్నట్టు కూడా తెలుస్తోంది. రుపే కార్డు ఖాతాదారుల బీమాను రూ. లక్ష వరకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.  

Narendra Modi
Jan Dhan account
Independence Day
RuPay Card
  • Loading...

More Telugu News