kerala: కేరళ వరద బాధితులకు రూ.5 లక్షల విరాళం ప్రకటించిన టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ

  • కేరళ తనకు ఎంతో ఇష్టమైన పర్యాటక ప్రదేశమన్న విజయ్
  • ఆదుకునేందుకు ముందుకు రావాలని అభిమానులకు పిలుపు
  • సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్

కేరళలో వరద బీభత్సానికి టాలీవుడ్ కూడా స్పందిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ కదిలి వచ్చి విరాళాలు ప్రకటిస్తుండగా, తాజాగా ‘అర్జున్ రెడ్డి’ హీరో విజయ్ దేవరకొండ కూడా ముందుకొచ్చాడు. తనకెంతో ఇష్టమైన కేరళ ఇలా వరదల బారినపడడం బాధగా ఉందన్న ఆయన తనవంతు సాయంగా ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటించాడు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అంతేకాదు, కేరళను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చాడు.

తనకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాల్లో కేరళ ఒకటని ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేశాడు. కేరళ వాసులు ఎంతో మంచివారని పేర్కొన్నాడు. మరోవైపు, తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమల హాసన్, కార్తీ, సూర్య తదితరులు ఇప్పటికే తమ వంతు సాయాన్ని ప్రకటించారు.  

kerala
Floods
Vijay devarakonda
Tollywood
Donation
  • Loading...

More Telugu News