Kamal Haasan: కేరళ వరద బాధితుల కోసం కదలిన కోలీవుడ్.. రూ.25 లక్షల విరాళం ప్రకటించిన కమల్

  • వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళ
  • కేరళ ముఖ్యమంత్రి విజ్ఞప్తికి భారీ స్పందన 
  • విరాళాలు ప్రకటించిన సూర్య, కార్తీ  

వరదలతో అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకునేందుకు కోలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు. సూపర్ స్టార్ కమల హాసన్, స్టార్ హీరోలు సూర్య, కార్తీ, విజయ్ టెలివిజన్ కలిసి మొత్తం రూ.75 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తికి స్పందించిన వీరంతా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.  

కమల హాసన్, విజయ్ టీవీ చెరో రూ.25 లక్షల విరాళం ప్రకటించగా, సూర్య, అతడి సోదరుడు కార్తీ కలిపి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.10 లక్షలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, వరదల్లో ఇప్పటి వరకు 33 మంది మృతి చెందగా, మరో ఆరుగురి జాడ గల్లంతైంది.

Kamal Haasan
Kerala
Floods
Donations
suriya
karthi
  • Loading...

More Telugu News