Rahul Gandhi: మళ్లీ కన్నుగీటిన రాహుల్.. జైపూర్‌ ఎన్నికల ప్రచార సభలో సరదా సన్నివేశం!

  • జైపూర్ ఎన్నికల సభలో కన్ను గీటిన రాహుల్
  • అశోక్‌ గెహ్లట్‌ను ఆలింగనం చేసుకున్న సచిన్ పైలట్
  • తమ మధ్య విభేదాలు లేవని చెప్పే యత్నం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు కన్నుగీటారు. రాజస్థాన్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జైపూర్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌ను చూసి కన్ను గీటారు. ఆ వెంటనే సచిన్ పైలట్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌ దగ్గరికెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తల్లో పసలేదని చెప్పే ప్రయత్నం చేశారు.  

ఇటీవల పార్లమెంటులో కన్ను గీటిన రాహుల్ బహిరంగ సభల్లో మాత్రం కన్ను గీటడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తిచేసి వెళ్లి ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం సీట్లో కూర్చుని పక్కనే ఉన్న కాంగ్రెస్ నేతను చూస్తూ కన్నుకొట్టారు. అప్పట్లో ఇది వైరల్ అయింది. మళ్లీ ఆదివారం కూడా ప్రసంగాన్ని ముగించిన వెంటనే రాహుల్ కన్ను గీటడం మరోమారు వైరల్ అయింది.

Rahul Gandhi
Jaipur
Election
Congress
sachin pilot
  • Loading...

More Telugu News