Ummareddy venkateshwarulu: కాపు ఉద్యమం నుంచి ముద్రగడ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలి?: వైసీపీ నేత ఉమ్మారెడ్డి

  • ఉద్యమాన్ని పక్కదారి పట్టించారు
  • టీడీపీతో ముద్రగడ కుమ్మక్కు  
  • కాపులకు అండగా ఉండేది వైసీపీనే

కాపు ఉద్యమం జోరుగా నడుస్తున్న వేళ యూటర్న్ ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కాపు ఉద్యమానికి వైసీపీ తొలి నుంచి అండగా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. చంద్రబాబుతో చేతులు కలిపి ఉద్యమాన్ని బలహీనపరిచారని అన్నారు.  

ఆదివారం గుడివాడలో ముద్రగడ మాట్లాడుతూ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట తప్పను, మడమ తిప్పను అనే జగన్ ఒక్కో సభలో ఒక్కోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తాననడం తమను అవమానించడమే అవుతుందని పేర్కొన్న ముద్రగడ, తామే రూ.20 వేల కోట్లు ఇస్తామని, సీఎం పదవిని తమకు ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు. ముద్రగడ వ్యాఖ్యలపై స్పందించిన ఉమ్మారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

Ummareddy venkateshwarulu
YSRCP
Jagan
Mudragada
Telugudesam
Andhra Pradesh
  • Loading...

More Telugu News