Geeta Govindam: పెన్ డ్రైవ్ లలో 'గీత గోవిందం'... లీక్ వెనుక కేఎల్ వర్శిటీ విద్యార్థిని!

  • సినిమాను పలువురికి పంపిన అమ్మాయి
  • పోలీసుల విచారణలో చెప్పిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్
  • ఎడిటింగ్ విభాగం నుంచి లీక్ అయినట్టు అనుమానం

'గీత గోవిందం' సినిమా ప్రింట్ కాపీని అమరావతి పరిధిలోని తాడేపల్లి, కేఎల్ యూనివర్శిటీకి చెందిన ఓ విద్యార్థిని లీక్ చేసినట్టు గుంటూరు పోలీసులు గుర్తించారు. ఆమె తన ఫ్రెండ్స్ అందరితో దాన్ని పంచుకుందని పోలీసులు తేల్చారు. సినిమా గుంటూరు ప్రాంతంలో పెన్ డ్రైవ్, సీడీల్లో సర్క్యులేట్ అవుతుండగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు మరిన్ని వివరాలను వెలుగులోకి తెచ్చారు.

ఇందులో భాగంగా పలువురు స్టూడెంట్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, వారిని ప్రశ్నించగా, ఓ విద్యార్థిని తమకు ఈ సినిమాను పంపించిందని చెప్పారు. ఆ అమ్మాయిని కూడా అదుపులోకి తీసుకుని ఈ లీక్ వెనకున్న అసలు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆ అమ్మాయికి పరిచయమున్న ఓ యువకుడు సినిమా ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్నాడని, అతనే తన వద్ద ఉన్న సినిమాను అత్యుత్సాహంతో ఆమెకు పంపాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Geeta Govindam
Leak
Movie
KL University
Police
Arrest
  • Loading...

More Telugu News