USA: నవ్వుతూ నవ్వుతూ... స్నేహితురాలిని జలపాతంలోకి తోసేసింది:.. వీడియో

  • అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ఘటన
  • మోల్టన్ జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లిన మిత్రబృందం
  • 60 అడుగుల ఎత్తునుంచి ఫ్రెండ్ ను తోసేసిన యువతి

సరదాగా విహార యాత్రలకు అందరూ కలసి వెళితే, తన స్నేహితురాలిని అమాంతం జలపాతంలోకి తోసేసిందో యువతి. ఈ ఘటనను వారి మరో స్నేహితురాలు వీడియో తీయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. గత వారంలో ఓ స్నేహబృందం వాషింగ్టన్ సమీపంలోని యాక్టోల్ మౌల్టన్ జలపాతం వద్దకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. సుమారు 60 అడుగుల పైనున్న బ్రిడ్జిపై నిలబడ్డ ఓ యువతి, జలపాతం అందాలను చూస్తుండగా, వెనకున్న మరో యువతి ఆమెను తోసేసింది.

 ఈ ఘటనలో నీళ్లల్లో పడిన యువతికి ఐదు పక్కటెముకలు విరిగాయి. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ జలపాతంలో డైవింగ్ ప్రమాదకరమని, నీళ్లల్లో రాళ్లు ఉంటాయని, లోతు కూడా అధికమని అధికారులు తెలిపారు. కాగా, తన కుమార్తెను స్నేహితురాలే చంపాలని చూసిందని గాయాలపాలైన యువతి తల్లి ఆరోపించింది. జలపాతంలోకి స్నేహితురాలిని నెడుతున్న యువతి వీడియోను మీరూ చూడవచ్చు.

USA
Waterfall
Washington
Moultan
  • Error fetching data: Network response was not ok

More Telugu News