KCR: ఈనెల 15నుండి 'తెలంగాణ కంటి వెలుగు' ప్రారంభం!
- ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాల ఏర్పాటు
- ప్రతీ ఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు
- అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు
ఈనెల 15న తెలంగాణ ప్రభుత్వం 'కంటి వెలుగు' పథకాన్ని ప్రారంభించనుంది. ‘అంధత్వ రహిత తెలంగాణ’ దిశగా చేపట్టిన ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే, కళ్లద్దాలు, మందుల పంపిణీతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారు. కాగా, ఈ పథకం వివరాలను గవర్నర్ నరసింహన్ ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.