MS Dhoni: రాంచీలో ధోని బైక్ మ్యూజియం.. అదిరిపోయిన అద్దాల మేడ!

  • ఫోటోను పోస్ట్ చేసిన ధోని భార్య సాక్షి
  • ఇంట్లోనే ఏర్పాటు చేశాడంటున్న అభిమానులు
  • ఇప్పటికే పలు ఖరీదైన బైక్ లు కొన్న ధోని

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనికి బైక్ లు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. క్రికెట్ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు ఎవరైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద బైక్ గెలుచుకుంటే సదరు ఆటగాళ్ల కన్నా ముందే ధోని వాటిపై షికారు చేస్తాడు. ఖాళీ సమయాల్లో మహి ఎక్కువగా బైక్ లతోనే గడుపుతాడు. తాజాగా ధోని భార్య సాక్షి, మహి బైక్ లు ఉంచే బిల్డింగ్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది.

’ధోని అమితంగా ఇష్టపడే టాయ్స్’ అనే ట్యాగ్ లైన్ తో సాక్షి సోషల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. పూర్తిగా గ్లాస్ తో అత్యాధునిక నిర్మాణ శైలిలో కట్టిన ఈ భవనం బయటి నుంచి ధోని బైక్ లను చూడవచ్చు. కాగా, రాంచీలోని తన ఇంటి ప్రాంగణంలోనే దీన్ని ధోని ఏర్పాటు చేసుకున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ధోని వద్ద పలు ఖరీదైన విదేశీ బైక్ లు ఉన్న సంగతి తెలిసిందే.

MS Dhoni
bike museum
ranchi
jarkhand
sakshi dhoni
photo
social media
  • Loading...

More Telugu News