paruchuri gopalakrishna: 'అత్తారింటికి దారేది' విషయంలో అదే జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ

  • బ్రహ్మానందం పాత్ర పొగరుగా ఉంటుంది 
  • ఆయనకి హీరో బుద్ధి చెప్పాలనుకుంటాడు 
  • అందులో భాగంగానే 'అహల్య' ఎపిసోడ్ వస్తుంది

తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ 'వాంటెడ్ లెంగ్త్' .. 'అన్ వాంటెడ్ లెంగ్త్' సీన్ల గురించి మాట్లాడారు. "సమాధి కడుతున్నాం చందాలివ్వండి' అనే నాటకం మా అన్నయ్య రాశాడు. పదివేల ప్రదర్శనలు జరుపుకున్న ఈ నాటకం .. ఎక్కడ ప్రదర్శించబడినా అన్ని ప్రైజ్ లను తుడిచిపెట్టుకు తెచ్చేది. అంతగొప్ప కథ సినిమాగా దెబ్బతింది. ఎందుకంటే ముఖ్యమైన పాయింటును వదిలేసుకుని వేరే ట్రాక్ నిడివి పెంచడంవలన అది అన్ వాంటెడ్ లెంగ్త్ అయింది.

 ఇక 'అత్తారింటికి దారేది' విషయానికే వస్తే, ఈ సినిమాలో .. థియేటర్లోని వాళ్లంతా ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసింది బ్రహ్మానందం గారి 'అహల్య' ఎపిసోడ్. అదే ఎపిసోడ్ లో ఆర్టిస్టులు మారుతూ అదే పనిగా నవ్విస్తూ వుంటారు. అది వాంటెడ్ లెంగ్త్ సీన్ కాదు అనిపిస్తుంది కానీ .. వాంటెడ్ లెంగ్తే. ఎందుకంటే .. బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు చూడండి .. డబ్బులు విసురుతూ చాలా పొగరుగా ప్రవర్తిస్తాడు. అత్తమీద ఉన్నటువంటి గౌరవంతో హీరో .. బ్రహ్మానందానికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అందులో భాగమైన 'అహల్య' ఎపిసోడ్ ఆటోమేటిగ్గా వాంటెడ్ లెంగ్త్ అయింది. అందువల్లనే ప్రేక్షకులంతా ఎంజాయ్ చేశారు" అని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News