Pakistan: ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు ఖర్చు చేసేందుకు టీడీపీ వాళ్లు సిద్ధమవుతున్నారు: పవన్ కల్యాణ్

  • ఈ డబ్బంతా అవినీతి ద్వారా సంపాదించిందే
  • ఈ రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి బ్రహ్మాండంగా ఉంది
  • ప్రజల అభిమానం ఉంటే 2019 లో సీఎం అవుతాను

రాబోయే ఎన్నికలకు సిద్ధమయ్యే నిమిత్తం నియోజకవర్గానికి రూ.40 కోట్లు ఖర్చు చేసేందుకు టీడీపీ వాళ్ళు సిద్ధమవుతున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పోరాట యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

‘ప్రజా విధానాలకు అనుగుణంగా పాలనలో భాగం కావడానికి అనుభవం కావాలి. ప్రజల సమస్యల గురించి, వాటికి తీసుకోవాల్సిన పరిష్కారాల గురించి అవగాహన ఉండాలి. ఆకళింపు చేసుకోవాలి. అందుకే, 2014లో ‘జనసేన’ పోటీ చేయలేదు. సీఎం కావడం సులభం కాదు. రాజకీయాల్లో సహనం కావాలి. అది నాకు ఉంది. 2019లో మీ ప్రేమ, అభిమానం ఉంటే తప్పకుండా సీఎం అవుతాను. రాబోయే ఎన్నికలకు సిద్ధం అయ్యేందుకు టీడీపీ వాళ్ళు ఒక్కో నియోజకవర్గానికి రూ.40 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇవన్నీ ఇసుక మాఫియాలోను, అవినీతి ద్వారానూ సంపాదించినవే. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి బ్రహ్మాండంగా ఉంది. నా దగ్గర చానెళ్లు, పత్రికలూ, డబ్బు లేకపోయినా గుండె నిండా ధైర్యం ఉంది. ప్రజలకి అండగా నిలుస్తాను’ అని పవన్ పేర్కొన్నారు.  

Pakistan
narasapuram
  • Loading...

More Telugu News