Prabhas: వజ్రాల దొంగగా కనిపించనున్న ప్రభాస్

  • 200 కోట్ల బడ్జెట్ తో 'సాహో'
  • వివిధ దేశాల్లో షూటింగ్ 
  • పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్  

'సాహో' సినిమాకి సంబంధించి ప్రభాస్ లుక్ బయటికి వచ్చాక, ఆయన పోషించేది రాబిన్ హుడ్ తరహా పాత్ర కావొచ్చని అనుకున్నారు. కానీ ఆయన అంతర్జాతీయ వజ్రాల దొంగగా ఈ సినిమాలో కనిపిస్తాడనేది తాజా సమాచారం. వివిధ దేశాల్లో ప్రాచీన కాలానికి చెందిన అత్యంత ఖరీదైన వజ్రాలపై కన్నేసి .. పక్కా ప్లానింగ్ తో వాటిని అపహరించే దొంగగా ప్రభాస్ కనిపిస్తాడట.

ఆయనను పట్టుకోవడానికి ఇంటర్ పోల్ అధికారులు ఎంతగా ప్రయత్నించినా క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతుంటాడు. ఆయన ఎందుకిలా వజ్రాలను కాజేస్తుంటాడనే విషయం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ వుంటుందనే టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈయనను పట్టుకోవడానికి నియమించబడిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధా కపూర్ కనిపించనుందట. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.             

Prabhas
shraddha kapoor
  • Loading...

More Telugu News