Pullela Gopichand: ప్రధాని మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరిన పుల్లెల గోపీచంద్

  • రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోపీచంద్
  • మొక్క నాటి మరికొందరిని నామినేట్ చేసిన కోచ్
  • దేశాన్ని పచ్చగా మార్చుదామని పిలుపు

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రధాని మోదీకి గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. హరితహారంలో భాగంగా మొక్కను నాటిన గోపీచంద్ ప్రధాని నరేంద్రమోదీ, క్రీడామంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, షూటర్ అభినవ్ బింద్రా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లను నామినేట్ చేశాడు.

ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ, దేశాన్ని పచ్చగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా తానో మొక్కను నాటినట్టు తెలిపారు. కాగా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో గ్రీన్ ఛాలెంజ్ ‌కు విశేష స్పందన లభిస్తోంది. ఛాలెంజ్‌కు నామినేట్ అయిన వారు మొక్కలు నాటుతూ మరో ముగ్గురికి సవాలు విసురుతున్నారు. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన గోపీచంద్ మొక్క నాటాడు. మరికొందరికి సవాలు విసిరాడు. 

Pullela Gopichand
Rajamouli
Green challenge
Narendra Modi
  • Loading...

More Telugu News