jet airways: వేతనాల్లో కోత కాదు.. ఏకంగా ఉద్యోగాల్లోంచే తీసేస్తున్న జెట్ ఎయిర్‌వేస్!

  • కష్టాల్లో జెట్ ఎయిర్‌వేస్
  • ఉద్యోగుల మెడపై కత్తి
  • త్వరలోనే ఉద్యోగులకు పింక్ స్లిప్‌ల జారీ

కష్టాల్లో పడి కొట్టుమిట్టాడుతున్న ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది. సంస్థను మరో ఆరు నెలలకు మించి ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఆర్థిక వనరులు లేవని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలను యాజమాన్యం ఖండించింది. ఆ తర్వాత పైలట్ల వేతనాల్లో 25 శాతం కోత విధించనున్నట్టు సమాచారం పొక్కింది. దీనిని కూడా ఖండించిన సంస్థ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

గ్రౌండ్ సిబ్బందిలో 500 మంది ఉద్యోగులను తొలగించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే వీరికి పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నారు. గ్రౌండ్ సిబ్బందితోపాటు కేబిన్ క్రూ పైనా వేటేయాలని భావిస్తోంది.

జెట్ ఎయిర్‌వేస్‌లో మొత్తం 16,558 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 5 వేల మంది గ్రౌండ్ సిబ్బంది. వీరు నెలకు రూ. 10 వేల నుంచి రూ.40 వేల మధ్య వేతనాలు అందుకుంటున్నారు. వీరిలో కొందరిని తొలగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నది జెట్ ఎయిర్‌వేస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సీనియర్ కేబిన్ క్రూ కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించలేదని సమాచారం.  

  • Loading...

More Telugu News