doctor shilpa: డాక్టర్ శిల్ప ఆత్మహత్య ఘటనపై సీఐడి విచారణ ప్రారంభం

  • ప్రొఫెసర్ల వేధింపులతో డాక్టర్ శిల్ప ఆత్మహత్య 
  • సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ బృందం
  • ఈ బృందంలో ఒక మహిళా ఇన్ స్పెక్టర్, నలుగురు ఇన్ స్పెక్టర్లు

తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణ ప్రారంభమైంది. సీఐడీ ఎస్పీ ఆధ్వర్యంలో పని చేయనున్న ఈ విచారణ బృందంలో ఒక మహిళా ఇన్ స్పెక్టర్, నలుగురు ఇన్ స్పెక్టర్లు సభ్యులుగా వున్నారు. కాగా, ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల కారణంగా మూడు రోజుల క్రితం శిల్ప ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా, శిల్ప ఆత్మహత్యకు ఎవరు బాధ్యత వహిస్తారని ఎస్వీ వైద్య కళాశాల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఓ ప్రొఫెసర్ తన చున్నీ లాగాడని ఓ విద్యార్థిని ఆరోపించింది. తమను ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని, కీచక ప్రొఫెసర్ రవి ఆగడాలపై ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

కీచక  ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రొఫెసర్లు ఇంతగా రెచ్చిపోవడానికి రాజకీయ అండే కారణమని విద్యార్థులు అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకోగలరని ప్రశ్నిస్తున్నారు. బాధిత విద్యార్థినులపై ప్రొఫెసర్లు అభాండాలు వేయడం దారుణమని, ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శిల్ప మానసిక పరిస్థితి బాగోలేదని అభాండాలు వేయడం దారుణమని మహిళా సంఘాలు మండిపడ్డాయి.  

doctor shilpa
svu
suicide
  • Error fetching data: Network response was not ok

More Telugu News