Mahesh Babu: 'మహర్షి' టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది

  • మహేశ్ బాబు 25వ మూవీగా 'మహర్షి'
  • డిఫరెంట్ లుక్స్ తో మహేశ్ బాబు 
  • హైలైట్ గా నిలవనున్న దేవిశ్రీ సంగీతం    

ఈ రోజు .. మహేశ్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రం 'మహర్షి' నుంచి ఈ రోజు ఉదయం టీజర్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ స్టూడెంట్ గా కొత్త లుక్ తో మహేశ్ బాబు ఈ టీజర్ లో కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాడు. ఈ టీజర్ ను విడుదల చేసిన కొన్ని గంటల్లోనే 1మిలియన్ డిజిటల్ వ్యూస్ ను క్రాస్ చేసేసింది. దీనిని బట్టి ఈ సినిమా పట్ల అంతా ఎంత ఆసక్తితో ఉన్నారనే విషయం అర్థమవుతోంది.

మహేశ్ బాబు కెరియర్లో 25వ సినిమాగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతుబిడ్డగాను ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. మొత్తానికి మహేశ్ లుక్ .. టీజర్ అంతా 'మహర్షి' గురించి మాట్లాడుకునేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.      

  • Loading...

More Telugu News