Kodakandla Sidhanti: నాడు కేసీఆర్ స్వయంగా పల్లకీ మోసిన 'కొడకండ్ల సిద్ధాంతి' ఇకలేరు!
- 94 ఏళ్ల వయసులో నిర్యాణం
- గతంలో సిద్దాంతి పల్లకీని స్వయంగా మోసిన కేసీఆర్
- అయుత చండీయాగమూ ఆయన చేతుల మీదుగానే
ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, సిద్ధాంతిగా దశాబ్దాల పాటు సేవలందించిన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి ఈ ఉదయం నిర్యాణం చెందారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. వరంగల్ జిల్లాలోని కొడకండ్ల ఆయన స్వగ్రామం కాగా, 'కొడకండ్ల సిద్ధాంతి'గా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. వృద్ధాప్య సమస్యల కారణంగా, కొడకండ్లలోని స్వగృహంలోనే ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.గతంలో రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో నృసింహరామ సిద్ధాంతికి ఘనంగా సన్మానం జరుగగా, 'ధార్మిక వరేణ్య' బిరుదును ఇచ్చి సత్కరించిన కేసీఆర్, ఆయనకు స్వర్ణ కంకణాన్ని తొడిగారు. ఆపై, ఆయన్ను పల్లకీలో ఉంచి స్వయంగా మోశారు. కేసీఆర్ తలపెట్టిన అయుత చండీయాగం కూడా కొడకండ్ల సిద్ధాంతి చేతుల మీదుగానే జరిగింది.