Naramalli Sivaprasad: పార్లమెంటులో చిత్తూరు ‘హిట్లర్’.. ఇంటర్నెట్ లో పేలుతున్న జోకులు!

  • హిట్లర్ వేషధారణలో పార్లమెంటుకు శివప్రసాద్
  • ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరికి నిరసన
  • గతంలోనూ పలు వేషాలు వేసిన శివప్రసాద్

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ నేత, చిత్తూరు లోక్ సభ సభ్యుడు ఎన్.శివప్రసాద్ గురువారం పార్లమెంట్ వద్ద హల్ చల్ చేశారు. జర్మనీ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ వేషధారణలో పార్లమెంటు వద్దకు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. శివ ప్రసాద్ గతంలోనూ స్కూలు పిల్లాడు, మాయల ఫకీరు, నారద ముని వేషాల్లో పార్లమెంటు వద్ద నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

కాగా, శివప్రసాద్ తాజా వేషంపై నెటిజన్లు జోకుల మీద జోకులు పేల్చుతున్నారు. ఈయన పార్లమెంటుకు వస్తున్నాడా? ఫ్యాన్సీ డ్రస్ పోటీకి వస్తున్నాడా? అని ఒకరు వెటకారమాడగా, టీడీపీ డ్రామా కంపెనీలకు ఎంపీ సీట్లు ఇస్తోందంటూ మరొకరు విమర్శించారు. ఇంకొక నెటిజన్ అయితే శివప్రసాద్ ను ఇదే డ్రస్సుతో ఇజ్రాయెల్ కు పంపాలని కూడా సూచించాడు. శివప్రసాద్ స్కూల్ లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ డ్రస్ పోటీలకు రెగ్యులర్ గా వెళ్లేవాడని మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

Naramalli Sivaprasad
Telugudesam MP
Adolf Hitler
Special Category Status
school boy
  • Loading...

More Telugu News