Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హిట్ సినిమా సీక్వెల్ లో అనుష్క! 
  • క్రిష్ నిర్మాణంలో 'పల్లెటూరి పిల్ల' సీరియల్  
  • 'పేపర్ బాయ్' రిలీజ్ డేట్  ఖరారు 
  • విలన్ గా వస్తున్న 'రోజా' ఫేం!

*  గతంలో వచ్చిన 'ఏ మాయ చేసావే (తమిళంలో 'విన్నయ్ తాండి వరువాయే') చిత్రానికి ఇప్పుడు తమిళంలో సీక్వెల్ చేస్తున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుష్క కథానాయికగా నటిస్తుందని సమాచారం.  
*  ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్ కి దర్శకత్వం వహిస్తున్న ప్రముఖ దర్శకుడు క్రిష్ ఓ టీవీ సీరియల్ నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం 'పల్లెటూరు పిల్ల' పేరిట ఓ అందమైన కథను కూడా ఆయన సిద్ధం చేసుకున్నాడు. త్వరలో దీని షూటింగ్ మొదలవుతుంది.
*  యువ దర్శకుడు సంపత్ నంది సొంత బ్యానర్ పై నిర్మిస్తున్న 'పేపర్ బాయ్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సంతోష్ శోభన్ హీరోగా రియా సుమన్, తాన్యా హాప్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న రిలీజ్ చేస్తారు. ఈ చిత్రం ద్వారా జయశంకర్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
*  ఒకప్పటి హీరోయిన్, 'రోజా' ఫేం మధుబాల తన సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ పాత్రలు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా 'అగ్నిదేవ' అనే తమిళ సినిమాలో మధుబాల విలన్ పాత్రను చేసిందట. ఈ పాత్ర ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని అంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News