mumbai: భారత్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురికి గాయాలు

  • ముంబయిలోని చంబూర్ ప్రాంతంలో ప్రమాదం
  • 43 మందికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం
  • స్థానిక ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు

ముంబయిలోని భారత్ పెట్రోలియంకు చెందిన రిఫైనరీ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ముంబయిలోని చంబూర్ ప్రాంతంలో ఉన్న ఈ రిఫైనరీ ప్లాంట్ లో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి  ఏడు అగ్నిమాపక వాహనాలు, రెండు భారీ ట్యాంకర్లు చేరుకుని మంటలను అదుపు చేశాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

mumbai
bharat petroleum
refinary
  • Loading...

More Telugu News