chiranjeevi: 'సైరా'లో ముఖ్యమైన పాత్రలో అల్లు అర్జున్?

  • షూటింగు దశలో 'సైరా'
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ
  • ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇటీవలే ప్రధాన పాత్రధారులు పాల్గొనగా పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడనేది తాజా సమాచారం.

'రుద్రమదేవి' సినిమాలో గోన గన్నారెడ్డిగా బన్నీ అద్భుతమైన పాత్రను పోషించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరహా పాత్రనే ఆయన ఈ సినిమాలోను చేయనున్నాడని అంటున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవలసి వుంది. ఒకవేళ అల్లు అర్జున్ చేయడం నిజమే అయితే .. అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.                

  • Loading...

More Telugu News