jagan: మురళి, పర్వతప్రసాద్ లపై సీరియస్ అయిన జగన్!

  • తూ.గో. జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వర్గ విభేదాలు
  • ఇద్దరినీ పిలిపించుకుని క్లాస్ పీకిన జగన్
  • పార్టీ అభివృద్ధికి పాటుపడాలంటూ హితబోధ

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వైసీపీలో నెలకొన్న వర్గపోరుపై ఆ పార్టీ అధినేత జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు మురళీరాజు, పర్వతప్రసాద్ లను తన శిబిరం వద్దకు పిలిపించుకున్న జగన్... వారిద్దరికీ క్లాస్ పీకారు. జగన్ పాదయాత్ర సందర్భంగా మురళీరాజు మేనల్లుడిపై పర్వతప్రసాద్ చేయి చేసుకున్నారు. ఈ విషయంపై వాకబు చేసిన జగన్ సోమవారం రాత్రి ఇద్దరినీ తన వద్దకు పిలిపించుకున్నారట.

కాకినాడ పార్లమెంటరీ కన్వీనర్ కురసాల కన్నబాబు సమక్షంలో జరిగిన సమావేశంలో... ఇద్దరూ విభేదాలు వీడాలంటూ జగన్ సూచించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడాలని చెప్పారు. మరోవైపు మురళీరాజు ఏర్పాటు చేసిన ప్రచార బెలూన్ లపై పార్టీ కోఆర్డినేటర్ ప్రసాద్ ఫొటో ఎందుకు పెట్టలేదంటూ జగన్ ప్రశ్నించినట్టు సమాచారం. జగన్ సీరియస్ కావడంతో ఇద్దరూ విభేదాలను పక్కన పెట్టి, పాదయాత్రలో పాల్గొన్నారు.

jagan
ysrcp
prathipadu
murali raju
parvatha prasad
  • Loading...

More Telugu News