paruchuri: కైకాల వారు మాపై అరిచేసేవారు: పరుచూరి గోపాలకృష్ణ

  • ఎస్వీఆర్ తరువాత కైకాలవారే 
  • మాయల ఫకీరు పాత్రల్లోను అంతే 
  • అలాంటి ఆయనని కమెడియన్ గా చూపించాం     

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ, కైకాల సత్యనారాయణ నటనలో గొప్పతనం గురించి ప్రస్తావించారు. " మేము సినిమాలకి రాస్తున్న తొలిరోజుల్లో కైకాల సత్యనారాయణ గారితో 'ఇది కాదు ముగింపు' .. 'ముందడుగు' వంటి సినిమాలు చేశాము. మాయల ఫకీరు వేషం వేస్తే ఎస్వీ రంగారావు తరువాత మళ్లీ కైకాల వారే వేయాలని పేరుతెచ్చుకున్న అద్భుతమైన నటుడిని, 'ముందడుగు' సినిమాలో కమెడియన్ గా చూపించేశాము.

మీరు గమనిస్తే శ్రీదేవిని ప్రేమిస్తూ .. కామెడీ చేస్తూ కనిపిస్తాడాయన. 'ఏంటయ్యా నేను ఎవరనుకుంటున్నారు .. ఈ క్యారెక్టర్ వేయిస్తున్నారు నాతో' అంటూ మమ్మల్ని తిట్టేసేవారు.  'ఆ మాట రామానాయుడి గారికి చెప్పండి' అంటే .. 'అమ్మో ఆయనకి చెప్పలేమండీ బాబూ' అనేవారు. రామానాయుడి గారికి భయపడి ఆయన ఆ పాత్రను చేశారు .. చాలా అద్భుతంగా ఆయన ఆ పాత్రను పండించారు. దాంతో 'బొబ్బిలి బ్రహ్మన్న'లోను .. 'అగ్నిపర్వతం'లోను అంతకు మించిన కమెడియన్ పాత్రలను వేయించాము. 'ఏంటిది పరుచూరి వారు?' అంటూ ఆయన మా మీద అరిచేసేవారు" అంటూ నవ్వేశారు.     

  • Loading...

More Telugu News