DMK: ఈ ఒక్కరోజూ నాన్నా అని పిలువనా?: స్టాలిన్ భావోద్వేగానికి డీఎంకే కార్యకర్తల కన్నీరు

  • పుట్టినప్పటి నుంచి నాయకుడిగానే చూశాను
  • ఈ ఒక్కసారీ నాన్నా అని పిలవనా?
  • తనలోని బాధను పంచుకున్న స్టాలిన్

"నేను పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని నా నాయకుడిగానే చూశాను. కనీసం ఇప్పటికైనా ఒకే ఒక్కసారి నేను నిన్ను నాన్నా అని పిలువనా?" అని డీఎంకే నేత స్టాలిన్ తన తండ్రిని తలచుకుంటూ రాసిన కవిత తమిళనాట ఇప్పుడు వైరల్ గా మారి డీఎంకే కార్యకర్తల కంట కన్నీరు పెల్లుబికేలా చేస్తోంది. తన తండ్రిని స్టాలిన్ ఏనాడూ 'అప్పా' (నాన్నా) అని పిలిచినట్టు బయటకు తెలియదు.

"ఇంతవరకూ గడిపిన నా జీవితంలో మీరు ఓ నేతగానే నాకు తెలుసు" అని కరుణానిధి ఆరుగురు వారసుల్లో ఒకరైన స్టాలిన్ తన కవితలో వ్యాఖ్యానించారు. కన్నీటితో తానిప్పుడు రాస్తున్నానని, ఇకపై ఇంట్లో మీ నవ్వు కనిపించదన్న సంగతి తలచుకోవడానికే భయపడుతున్నానని ఆయన తనలోని బాధను చెప్పుకున్నారు. కాగా, కరుణానిధిలానే ఆయన రాజకీయ వారసుడైన స్టాలిన్ కు కూడా కవిత్వంపై మంచి పట్టుంది.

DMK
Karunanidhi
Stalin
Poem
  • Error fetching data: Network response was not ok

More Telugu News