karunanidhi: చిన్నారి మునిమనవడితో క్రికెట్ ఆడిన కరుణానిధి .. నాటి వీడియో ఇది!

  • అస్వస్థతకు గురికావడానికి ముందు ఆటలు
  • మునిమనవడు బ్యాటింగ్..కరుణ బౌలింగ్
  • మనవడిని తికమకపెట్టాలని చూసిన కరుణ

గొప్ప రాజకీయవేత్త, సాహితీవేత్త అయిన కరుణానిధికి క్రికెట్ అంటే ఎంతో అభిమానం. అంతవరకూ క్షణం తీరిక లేకుండా గడిపిన కరుణానిధి అస్వస్థతకు గురికావడానికి కొన్ని రోజుల ముందు తన చిన్నారి మునిమనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆసక్తికరంగా ఉంది. తన మునిమనవడు బ్యాటింగ్ చేస్తుంటే.. వీల్ ఛైర్ లో ఉన్న కరుణానిధి బాల్ విసరడం ఈ వీడియోలో కనిపిస్తుంది. బాల్స్ విసిరేటప్పుడు తన ముని మనవడిని తికమకపెట్టేందుకు కరుణ ప్రయత్నించడం ఆసక్తికరం. ఈ వీడియోలో కరుణ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.

karunanidhi
dmk
  • Error fetching data: Network response was not ok

More Telugu News