Sai Pallavi: సాయిపల్లవితో శేఖర్ కమ్ముల మరో సినిమా!

  • 'ఫిదా' తర్వాత శేఖర్ మరో ప్రేమకథ
  • హీరోగా విక్రం తనయుడి పరిచయం 
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి 

అందమైన ప్రేమ కథలను మరింత అందంగా తెరకెక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందెవేసిన చేయి. గతంలో ఆయన రూపొందించిన 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్'.. ఆమధ్య వచ్చిన 'ఫిదా' వంటి సినిమాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈయన మరో ప్రేమ కథా చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటుడు విక్రం తనయుడు ధృవ్ ను తెలుగుతెరకు పరిచయం చేస్తున్నాడు.

విశేషం ఏమిటంటే, ఇందులో కూడా కథానాయికగా 'ఫిదా' నాయిక సాయిపల్లవిని తీసుకుంటున్నారట. శేఖర్ ఆమెకు కథను వినిపించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని, ఇక డేట్స్ కేటాయించడమే తరువాయని సమాచారం. మరో విశేషం ఏమిటంటే, ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.         

Sai Pallavi
Shekhar Kammula
Fidha
  • Loading...

More Telugu News