Newly Married: నెల క్రితమే పెళ్లి.. అప్పుడే భార్యకు డెలివరీ.. వదిలేసిన భర్త... అవమానంతో తండ్రి ఆత్మహత్య!

  • 35 రోజుల క్రితం యువతికి వివాహం
  • రెండు రోజుల క్రితం ప్రసవం
  • పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

ఇటీవల వివాహం చేసుకున్న ఓ యువతి ప్రసవించడంతో, మనస్తాపానికి గురైన ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడు, దిండుగల్ సమీపంలోని కన్నివాడి ధర్మత్తుపట్టి పరిధిలోని రెడ్డియార్ చత్తిరం సమీపంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, 35 రోజుల క్రితం... అంటే జూలై 1న చెన్నైలో తన 21 సంవత్సరాల కుమార్తెకు మునియప్పన్ అనే రైతు వైభవంగా వివాహాన్ని జరిపించాడు. ఆమె వివాహం ఓ పూల వ్యాపారితో జరిగింది. ఆపై భార్యతో కొద్ది రోజులు గడిపిన అతను, తిరిగి వ్యాపారం నిమిత్తం చెన్నై వెళ్లిపోయాడు.

మూడు రోజుల క్రితం ఆ నవ వధువు కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో, దిండుగల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె గర్భవతని తేల్చారు. ఆపై 4వ తేదీన ఆమె మగ బిడ్డను ప్రసవించింది. దీంతో ఆమె కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త, చెన్నై నుంచి తిరిగి వచ్చి, ఇక ఆమెతో కాపురం చేసేది లేదని తెగేసిచెప్పి వెళ్లిపోయాడు. దీంతో బంధుమిత్రుల్లో తన పరువు పోయిందని మనస్తాపానికి గురైన ఆమె తండ్రి మునియప్పన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతన్ని గమనించిన బంధువులు, ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు పోయాయి. కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Newly Married
Pregnency
Delivary
Sucide
Tamilnadu
  • Loading...

More Telugu News