Kamal Haasan: కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైన కమల్.. వెల్లడించిన తమిళనాడు కాంగ్రెస్ చీఫ్

  • కాంగ్రెస్‌తో పొత్తుకు కమల్ మొగ్గు
  • ఇప్పటికే కుదిరిన కాంగ్రెస్-డీఎంకే పొత్తు
  • అందరం కలిసి పోరాడతామన్న తిరునావుక్కరసర్‌

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు కమలహాసన్ ఓకే చెప్పేశారా? అంటే, అవుననే అంటున్నారు తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌. తమతో పొత్తుకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమతో కలిసి వచ్చేందుకు మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ సానుకూల సంకేతాలు ఇచ్చినట్టు తెలిపారు. 

డీఎంకే-కాంగ్రెస్ పొత్తు ఇప్పటికే ఖరారైందని పేర్కొన్న ఆయన, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, రాందాసు నేతృత్వంలోని పీఎంకే, తిరుమావళవన్‌ నేతృత్వంలోని వీసీకే పార్టీలు కూడా తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పుడు కమల్ కూడా తమవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అందరం కలిసి సమష్టిగా ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.  

Kamal Haasan
Tamilnadu
Congress
Makkal Needhi Mayyam
  • Loading...

More Telugu News