kcr: కేసీఆర్ సోదరి మృతికి చంద్రబాబు సంతాపం
- లీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి
- భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను
- ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ సోదరి లీలమ్మ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. లీలమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.