Chattisghad: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... 14 మంది మావోల హతం!

  • కొంట సమీపంలో ఎన్ కౌంటర్
  • కూంబింగ్ కు వెళ్లిన జవాన్లకు తారసపడ్డ మావోలు
  • ఎన్ కౌంటర్ లో జవాన్లకూ గాయాలు

ఛత్తీస్‌ గడ్‌ లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌ కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. కొంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి, కన్నాయి గూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కు వెళ్లిన జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డ వేళ ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. తమకు లొంగిపోవాలని జవాన్లు హెచ్చరించినా, వినకుండా మావోలు కాల్పులు ప్రారంభించడంతో ప్రాణ రక్షణకు జవాన్లు కూడా ఫైరింగ్ జరిపినట్టు తెలుస్తోంది.

ఎన్ కౌంటర్ ను ధ్రువీకరించిన స్థానిక పోలీసు అధికారులు, కొందరు జవాన్లకు కూడా గాయాలు అయ్యాయని, వారిని ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల సంఖ్యపై అధికారిక ప్రకటన తరువాత వెల్లడిస్తామని, ప్రస్తుతం వారిని గుర్తించే పనిలో ఉన్నామని అన్నారు. కాగా, ఎన్ కౌంటర్ తరువాత ఆ ప్రదేశానికి అదనపు బలగాలను తరలించిన ఉన్నతాధికారులు, అడవులను జల్లెడ పడుతున్నారు.

Chattisghad
Encounter
Maoists
  • Loading...

More Telugu News